నందమూరి పంచెకట్టు సెలబ్రేషన్స్….

325
- Advertisement -

హరికృష్ణ పెద్ద కుమారుడు స్వర్గీయ జానకి రామ్ కుమారులు ఇద్దరికీ పంచెకట్టు వేడుకను నందమూరి కుటుంబం గ్రాండ్ గా నిర్వహించింది. ఈ వేడుక కోసం నందమూరి ఫ్యామిలీ అంతా తూర్పు గోదావరికి తరలి వెళ్ళింది. మొన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఫ్యామిలీతో అట్టహాసంగా రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో అక్కడికి ఎందుకు వెళ్ళారో అభిమనులకు అర్ధం కాలేదు.

కరప మండలంలోని.. వేళంగి గ్రామంలో జరిగిన ఈ పంచెకట్టు కార్యక్రమంకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో నందమూరి హీరోలు అక్కడికి ఎందుకు వెళ్ళారనే దానిపై అభిమానులలో ఓ క్లారిటీకి వచ్చింది. హరికృష్ణ ఫ్యామిలీ.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ.. కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ.. ఇలా నందమూరి కుటుంబ సభ్యులు అందరు ఒకే చోటికి చేరడంతో వేడుక సందడిగా మారింది. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ని చూసేందుకు ఊరి జనం బారులు తీరారు. ఇంట్లో జరుగుతున్న కార్యక్రమంకి సంబంధించిన పనులు చూసుకుంటూనే మరో వైపు తమ కోసం వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారట ఈ నందమూరి హీరోలు.

NANDAMURI FAMILY CELEBRATIONS

అయితే..జానకి రామ్ కుమారుల దగ్గరకి ఎన్టీఆర్ వెళ్ళగానే వాళ్ళిద్దరూ కూడా పరుగున వచ్చి బాబాయ్ ను గట్టిగా కౌగిలించుకున్నారు. దీంతో షడన్ గా అన్నయ్య జానకి రామ్ గుర్తుకువచ్చి కాస్త ఎమోషన్ అయ్యడట జూనియర్‌ ఎన్టీఆర్‌, ఈ సన్నివేశాన్ని చూసిన అక్కడి వారంతా కన్నీరు పెట్టుకున్నారు.

ఆద్యంతం జానకి రామ్ స్మరనలోనే జరిగిన ఈ కార్యక్రమంలో కుమారులిద్దరికీ కూడా పట్టు వస్త్రాలు ఇచ్చి ఎన్టీఆర్ దంపతులతో పాటు కళ్యాణ్ రామ్ జంట కూడా వారిని ఆశీర్వదించారు. ఇక తండ్రి లేని లోటును ఆ చిన్నారులకి ఎక్కడా తెలియకుండా జరిపినప్పటికీ, ఒకింత వెలితిగానే ముగిసిందట. బయట వారు కూడా ఒక్కసారిగా ఆ పిల్లల్ని చూసి, ఈ సమయంలో తండ్రి ఉంటే ఎంత సంతోషించేవాడో అని కన్నీరు పెట్టుకున్నట్టున్నారట.

- Advertisement -