పూరీ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి హీరో ఎంట్రీ?

481
nandumri mokshjana
- Advertisement -

టాలీవుడ్ హీరోల్లో మూడో త‌రం వార‌స‌త్వం కూడా ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా నంద‌మూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది హీరోలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో హీరో ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీగా ఉన్న‌ట్లు స‌మాచారం. నంద‌మూరి బాల‌కృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమాల్లో న‌టించేందుకు అంతా సిద్దం చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. బోయపాటి శ్రీను, క్రిష్‌ లాంటి దర్శకులతో సినిమాలు కన్ఫామ్‌ అయినట్టుగా కూడా వార్తలు వినిపించాయి.

nandumri mokshjana

తాజాగా ఈలిస్ట్ లోకి మ‌రో ద‌ర్శ‌కుడు పేరు క‌న్ఫామ్ అయిన‌ట్టు తెలుస్తుంది. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. పూరీ జ‌గ‌న్నాథ్ నంద‌మూరి బాల‌కృష్ణ కాంబినేష‌న్ లో వ‌చ్చిన పైసా వ‌సూల్ సినిమా మంచి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అదే న‌మ్మ‌కంతో బాల‌కృష్ణ త‌న కుమారున్ని పూరీకి అప్ప‌జెప్పిన‌ట్టు స‌మాచారం.

puri

పూరీ జ‌గ‌న్నాథ్ కు స‌రైన హిట్ లేక చాలాకాలం అయింది. అయిన పూరీ చెప్పిన క‌థ బాల‌కృష్ణ‌కు న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని స‌మాచారం. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్, సాండల్‌వుడ్‌ స్టార్‌ హీరో పునీత్‌ రాజ్‌ కుమార్‌, యంగ్ హీరో ఇషాన్‌లను వెండితెరకు పరిచయం చేశాడు పూరి జ‌గ‌న్నాథ్.

- Advertisement -