శబరిమల తీర్పుపై రివ్యూకు సుప్రీం ఓకే..

257
shabarimala supremecourt
- Advertisement -

ఎట్టకేలకు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లొచ్చిన తమ తీర్పుపై రివ్యూకు అంగీకరించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు. తీర్పు అనంతరం కేరళలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొనగా ఈ తీర్పును సమీక్షించాలని 49 పిటిషన్లు దాఖలయ్యాయయి. వీటన్నింటినీ జనవరి 22న ఓపెన్ కోర్టు(ప్రజల సమక్షంలో) విచారించేందుకు అంగీకరించింది సుప్రీం కోర్టు.

పది నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఆలయంలోకి వెళ్లొచ్చంటూ సెప్టెంబర్‌లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తీర్పు తర్వాత రెండుసార్లు గుడి తలుపులు తెరిచినా.. ఒక్క మహిళ కూడా ఆలయంలోకి అడుగుపెట్ట లేకపోయింది. కొందరు మహిళల పోలీసుల రక్షణతో గుడి దగ్గరి వరకు వెళ్లినా.. తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో వెనుదిరిగారు.

ఈ నేపథ్యంలో శబరిమలపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ల విచారణకు అంగీకరించిన న్యాయస్థానం పాత తీర్పుపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.

- Advertisement -