రాజకీయాలంటే తనకు ఆసక్తిలేదని తేల్చిచెప్పారు సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత. ఫిబ్రవరి 10 నమ్రతా-మహేష్ పెళ్లి జరిగి 14 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మహేష్ గురించి నమ్రత పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. రాజకీయాల ప్రస్తావన రాగానే చేతులెత్తి దండం పెట్టేశారు. అంతేగాదు మహేష్ సైతం ఎప్పటికి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వరని స్పష్టం చేశారు.
వంశీ సినిమా షూటింగ్ కోసం న్యూజిలాండ్‌కు వెళ్లిన సమయంలో మహేష్‌తో నాకు మంచి స్నేహం ఏర్పడిందని ఆ తర్వాత స్నేహం కాస్త ప్రేమగా మారిందన్నారు. ముందు తానే మహేష్‌కి ప్రపోజ్ చేశానని తర్వాత మహేష్ కూడా ఓకే చెప్పారన్నారు. ఒకరిపైఒకరికి పూర్తి అవగాహన రావడంతో పెళ్లిచేసుకోవాలనే నిర్ణయానికి వచ్చామన్నారు.
తనకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరని మహేషే తనకు అన్ని తెలిపారు. భర్తగా మహేష్‌కు 10కి 10 మార్కులు వేస్తానని తెలిపిన నమ్రత నటనకి 10కి 20 మార్కులు వేస్తాను అని చెప్పారు. తమ 14వ పెళ్లి రోజును పురస్కరించుకొని బేగంపేటలోని దేవనార్ స్కూల్ ఆఫ్ బ్లైండ్‌కు చెందిన 650 మంది అంధ బాలలకు విందు ఏర్పాటుచేశారు.