ఆ పెద్దింటి పెళ్లిలో నమ్రతదే హావా…

248
namratha
- Advertisement -

అన్ని కుదిరితే అక్కినేని వారబ్బాయి అఖిల్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్త, జీవీకే సంస్థల అధినేత జీవీకే మనవరాలు శ్రీయా భూపాల్‌ పెళ్లి ఈ పాటికే అయిపోయేది కానీ.. కారణాలు ఏవైనా వీరిద్దరి పెళ్లి క్యాన్సిల్‌ అయిపోయింది. ఇప్పుడు అఖిల్‌ను పెళ్లి చేసుకోవాల్సిన శ్రీయా భూపాల్‌ ఇప్పుడు మరో పారిశ్రామిక వేత్త వారసుడిని పెళ్లిచేసుకోబోతోంది.

Namrata-Shirodkar-

అఖిల్‌ను కాదనుకుని వేరే వ్యక్తిని పెళ్లిచేసుకోబోతోందా.. ఎవరబ్బా అతను అని ఆశ్చర్యపోతున్నారా..? మీరు అనుకుంటున్నట్లు ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు.. ఆ వ్యక్తి దేశంలోనే ప్రముఖ వైద్య సంస్థలైన అపోలో గ్రూప్‌ సంస్థల ఏకైక వారసున్నే పెళ్లి చేసుకోబోతోంది. ఆయన పేరు ఐంద్రీత్‌.. ఐంద్రీత్ మెగా కోడలు కొణిదెల ఉపాసన పిన్ని కొడుకు. శ్రీయా భూపాల్‌ – ఐంద్రీత్‌ల ఎంగేజ్ మెంట్‌ ప్రాన్స్‌ రాజధాని పారిస్‌కు దగ్గరలో ఉన్న ఒక పురాతన ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ పెళ్లికి సినీ పరిశ్రమలో అతిరథ మహారదులు హాజరయ్యారు.

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రిన్స్‌ మహేష్‌ బాబు సతీమణి నమ్రత గురించే. నమ్రత తన ముద్దుల కూతురు సితారతో కలిసి ఈ ఎంగేజ్‌ మెంట్‌ వేడుకలో పాల్గొంది. ఉపాసనకు నమ్రత మంచి ఫ్రెండ్‌ కాబట్టి ఈ పెళ్లి వేడుకలో నమ్రత అక్కడున్నవారందరితో ఫోటోలు దిగి ఆ ఫోటోలను తన సోషల్‌ మీడియాలో ఫోస్ట్‌ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

- Advertisement -