బాలీవుడ్‌ డ్రగ్స్ వ్యవహారంలో నమ్రత పేరు..?

161
Namrata

బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలో రోజుకో కొత్త పేరు బయటపడుతుంది. ఇప్పటివరకు ఎన్.సి.బి విచారణలో పలువురు అగ్ర కథానాయికల పేర్లు బయటపడుతుండడం సంచలనమైంది. తాజాగా ఈ కేసులో టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు బయటపడ్డట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.ఎన్.సి.బి ట్రాకింగ్ లో జయసాహాతో నమ్రత చాటింగు బయటపడిందని వార్తలు వస్తున్నాయి. నమ్రత పేరు వినిపించడంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇప్పటికే ఈ వ్యవహారంలో నటీనటుల జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే పేరు బయటకు రావడం కలకలం రేపింది. ఎన్.సి.బి విచారణలో రియా చక్రవర్తి 25 మంది పేర్లను వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సినీ ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు బయటకు వచ్చిన పేర్లలో సారా అలీఖాన్, కరీనా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ఉండటం తెలిసిందే.