పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: మంత్రి కొప్పుల

112
koppula

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈరోజు జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా లభ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయం నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.

ఆడపిల్లల తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయన్నారు. అనంతరం దివ్యాంగులకు ఏడీఐపీ పథకం కింద బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి రమణారావు, జెట్పీటీసీ కాసుకంటి రాజేందర్, ఎంపీపీ గోళి శోభ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.