మహేష్‌ 27లో నమ్రతా..!

136
mahesh babu

సరిలేరు నీకెవ్వరు సినిమాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టారు సూపర్ స్టార్ మహేష్. ప్రస్తుతం గీతాగోవిందం దర్శకుడు పరుశరాంతో తన 27వ సినిమా చేస్తున్న మహేష్‌ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది.

#Mahesh27లో నమ్రత ఓ గెస్ట్ రోల్ చేయనుందట. సినిమాలో ఓ గెస్ట్ రోల్ కి నమ్రత అయితే బాగుంటుందని దర్శకుడు పరుశురాం బావించారట. ఇదే విషయాన్ని మహేష్, నమ్రతలకు చెప్పగా వీరిద్దరూ ఒకే చెప్పారట.

గీతగోవిందం సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌,నిత్యామీనన్‌తో గెస్ట్ రోల్ చేయించాడు పరుశురాం. ఇప్పుడు మహేష్ సినిమా విషయంలోనూ అదే ఫాలో అవుతున్నాడట. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచిచూడాలి.