రానా….లవ్ కహానీ..!

159
rana

బాహుబలి ఫేమ్,యంగ్ హీరో రానా ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. మిహికాను ఈ ఏడాది వివాహం చేసుకోబోతున్న రానా తన లవ్ కహానిని వెల్లడించారు. మంచు లక్ష్మీతో లైవ్ చాట్ చేసిన రానా తన లవ్ స్టోరీ ఎలా మొదలైందో వెల్లడించారు.

వెంకటేష్ బాబాయ్ కూతురు అశ్రిత, మిహిక క్లాస్ మేట్స్ అని తను ముంబైలో పెరిగిన అమ్మాయి. అశ్రిత ద్వారా మిహిక పరిచయం అయింది…ఈ మధ్యే తనపై లవ్ ఫీలింగ్ కలిగిందని చెప్పుకొచ్చారు.

తొలుత మిహికాకు ప్రపోజ్ చేయడానికి ఇబ్బంది పడ్డాను …ఓ రోజంతా ఆలోచించి ఫోన్‌లో ప్రపోజ్ చేశానని తెలిపారు రానా. కొన్నిరోజుల తర్వాత తాను ఒప్పుకుందని…తర్వాత ఇంట్లో చెప్పడానికి కేవలం 2 నిమిషాలు పట్టిందన్నారు.

ఇటీవల జరిగిన ఫంక్షన్‌ రోకా (గెట్ టు గెదర్ లాంటిది) మాత్రమేనని వెల్లడించారు రానా.