న్యూజిలాండ్‌పై టాస్ గెలిచిన నమీబియా..

103
- Advertisement -

టీ20 వరల్డ్‌కప్ 2021 మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. అన్ని జట్లు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నాయి. టాప్ టీమ్స్ తో పాటు చిన్న జట్లు కూడా తగ్గేదే లే అన్నట్లు పోరాడుతున్నాయ్. ఈ నేపథ్యంలో మరో కీలక పోరు నేడు జరుగుతోంది. శుక్రవారం గ్రూప్-2లో న్యూజిలాండ్, నమీబియా పోటీపడుతున్నాయి. ఈరోజు మ్యాచ్‌కు షార్జా ఆతిథ్యమిస్తోంది. న్యూజిలాండ్‌పై టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్ లో గెలిస్తే న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుతుంది. ఓడిపోతే మాత్రం టీమిండియాకు లాభిస్తుంది. తన చివరి రెండు మ్యాచ్ లను టీమిండియా భారీ తేడాతో నెగ్గితే న్యూజిలాండ్ ను వెనక్కినెట్టి సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంటుంది. ఇది జరగాలంటే నేడు నమీబియా అద్భుతం చేయాలి!మరి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి!

- Advertisement -