తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోష్ కొనసాగుతోంది. తాజాగా నిర్మల్ జిల్లాకు చెందిన యువ నాయకుడు నల్లా వినయ్ రెడ్డి గులాబీ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచాంద మండలంలో నల్లా వినయ్ రెడ్డికి, ఆయన కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. మాజీ సమితి ప్రెసిడెంట్ భీమిరెడ్డి మనవడిగా వినయ్ రెడ్డికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. స్థానికంగా వారి కుటుంబానికి బలమైన పరిచయాలు ఉండటంతో పాటు ప్రజల్లోనూ ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో యువ నాయకుడిగా వినయ్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం నిర్మల్ జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
మరోవైపు ఈ నెల 11న నిర్మల్లో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా రైతు గర్జన బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు.
Also Read:అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పాదయాత్ర

