మర్డర్ ఎఫెక్ట్….ఆర్జీవీపై కేసు

98
murder movie

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన కథను తెరకెక్కిస్తున్నాడు. సూర్యపేటకు చెందిన అమృత ప్రణయ్ ల లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మర్డర్ అనే టైటిల్ ఖరారు చేయడమే కాదు సినిమా ఫస్ట్ లుక్‌ని కూడా రిలీజ్ చేశాడు. తర్వాత మరో లుక్‌ అమృత తన కుమారుడిని ఎత్తుకున్న పోస్టర్‌ని రిలీజ్ చేయగా ఈ లుక్ వైరల్‌గా మారింది.

ఈ నేపథ్యంలో స్పందించారు ప్రణయ్ తండ్రి బాలస్వామి. మర్డర్ మూవీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బాలస్వామి…సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసేలా ఉందంటూ నల్గొండ ఎస్సీ ,ఎస్టీ కోర్టులో ఆయన ఫిర్యాదు దాఖలు చేశారు.

దీనిపై స్పందించిన ఎస్సీ,ఎస్టీ కోర్టు.. రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించింది.