7 నుండి నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్..

179
bharat biotech
- Advertisement -

ప్రపంచవ్యాపంగా కారోన మహ్మరిని అరికట్టడం కోసం పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి.వాక్సిన్ పురోగతిలో భారత్ దేశం ముందడుగు వేసింది.భారత బయోటెక్ రూపోందించిన కో వాగిజిన్ క్లినికల్ ట్రయిల్ 7 వ తేదీ నుంచి నిమ్స్ ఆసుపత్రిలో ప్రారంభం కానుంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోన్న స‌మ‌యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ స్వదేశీ వాక్సిన్ ను క్లినికల్ ట్రయిల్ ని ప్రారంభించనున్నట్టు ఐసీఎంఆర్ తెలిపింది. త్ తొలి దేశీయ కరోనా వ్యాక్సిన్‌‌ను లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించింది. దీని కోసం మెడికల్ ఇన్‌‌స్టిట్యూషన్స్, ఆస్ప‌త్రులు కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌‌ స్పీడ్ పెంచాలని ఐసీఎంఆర్ సూచించింది.

హైద‌రాబాద్‌లోని నిమ్స్‌‌తో సహా దేశంలోని 13 హాస్పిటల్స్‌‌లో క్లినికల్ ట్రయల్స్‌‌కు సహకరించాలంటూ ఐసీఎంఆర్ ఒక సర్క్యూలర్ జారీ చేసింది. ఇక‌, ఐసీఎంఆర్ ఆదేశాల‌పై స్పందించారు నిమ్స్ డైరెక్టర్ మనోహర్.. నిమ్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఐసీఎంఆర్ వాక్సిన్ ట్రయిల్స్‌కు నిమ్స్‌ను ప్ర‌క‌టించింద‌న్న ఆయ‌న‌.. 7వ తేదీ నుంచి క్లినిక్ ల ట్రయిల్ ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు

.నిమ్స్ ఆసుపత్రికి గత 20 సంవత్సరాలు నుంచి కూడా ఫేజ్ 1 ట్రయిల్ నిర్వహించిన అనుభవం ఉంది అని వైద్యలు తెలుపుతున్నారు.ఇప్పటి కె నిమ్స్ లో ట్రయిల్ రన్ నిర్వహించడానికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సిద్ధం చేశారు.ప్రపంచంలోనే మొదటి సారిగా ఈ వైరస్ పైన స్టడీ జరగబోతుంది అని డాక్టర్ ఉష రాణి క్లినికల్ ఫార్మకాలజీ అండ్ థెరపీయూటిక్స్ హెచ్ ఓ డి తెలిపారు.ప్రొడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ గా నిమ్స్ ఉందన్నారు.

ఫేజ్‌ 1,ఫేజ్‌ 2 కింద నిమ్స్ ఆసుపత్రిలో ఈ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతునున్నాయ‌.మొదటి ఫేజ్ దాదుపుగా 28 రోజులు సమయం తీసుకుంటారు.మొత్తం 60 మంది పైన ఈ క్లినికల్ ట్రయిల్ జరుపనున్నారు.క్లినికల్ ట్రయిల్ రన్ లో పాల్గొనే వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అని నిర్ధారించుకున్న వాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది.వాక్సిన్ ఇచ్చిన తరవాత 2 రోజులు పాటు ఆసుపత్రిలోనే ఆజర్వేషన్ లో ఉంచితారు.వాక్సిన్ ఇచ్చిన తరవాత అతిని రిపోర్ట్స్ ని తిరిగి ఐసీఎంఆర్ కి పంపడం జరుగుతుంది.

- Advertisement -