నాగశౌర్యతో రవితేజ దర్శకుడు?

56
- Advertisement -

ధమాకా తో టాప్ లిస్టులో చేరాడు దర్శకుడు త్రినాద్ రావు నక్కిన. రవితేజ కి సాలిడ్ హిట్ ఇచ్చి 100 కోట్ల గ్రాస్ క్లబ్ లిస్టులో చేరిపోయాడు. ఈ సక్సెస్ తర్వాత తాజాగా నెక్స్ట్ సినిమాకు సంబందించి ఎనౌన్స్ మెంట్ ఇచ్చాడు త్రినాద్ రావు. ఐరా క్రియేషన్స్ లో తదుపరి సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఐరా క్రియేషన్స్ నాగ శౌర్య స్వంత బేనర్ అన్న సంగతి తెలిసిందే. శౌర్య తల్లి దండుల చేతుల మీదుగా దర్శకుడు త్రినాద్ రావు అడ్వాన్స్ అందుకుంటున్న ఫోటో బయట పెట్టారు.

అయితే ఈ ప్రొడక్షన్ లో త్రినాద్ రావు సినిమా చేయబోయే హీరో శౌర్య అనే టాక్ వినబడుతుంది. ఇటీవలే త్రినాద్ రావు చెప్పిన ఓ పాయింట్ నచ్చడంతో ఈ సినిమాను సొంత ప్రొడక్షన్ లోనే చేయాలని భావించి తన తల్లి దండ్రులతో దర్శకుడికి అడ్వాన్స్ ఇప్పించడాని తెలుస్తుంది. శౌర్య కొన్నేళ్లుగా మాస్ హీరో అనిపించుకోవాలని చూస్తున్నాడు. దానికి తగ్గ కథలే ఎంచుకుంటున్నాడు. కానీ వర్కవుట్ అవ్వడం లేదు. ఇప్పుడు త్రినాద్ రావు వంటి మాస్ కమర్షియల్ దర్శకుడితో సినిమా చేస్తే మాస్ ఇమేజ్ వస్తుందని భావిస్తున్నాడు కాబోలు.

త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. త్రినాద్ రావు , ప్రసన్న కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ సాదించాయి. ఇప్పుడు ఇద్దరు విడిపోయారు. ప్రసన్న నాగార్జున సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు. సొ ఈ సినిమాతో త్రినాద్ రావు మళ్ళీ సోలోగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి…

నెక్ట్స్‌ లెవల్ రావణాసుర మూవీ..ఫరియా

పిక్ టాక్ : ముద్దుగుమ్మ కొత్త అందాలు!

రామ్ చరణ్ కు స్పొర్ట్స్ అంతా ఇష్టమా ?

- Advertisement -