- Advertisement -
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందన్నారు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్. మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్…గురువారం రాత్రి 10.30 గంటలకు ప్రమాదం జరిగిందని..ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పొగలు కమ్ముకున్నాయని చెప్పారు.
జెన్ కో దవాఖానలో ఆరుగురు చికిత్స పొందుతున్నారని…మరో తొమ్మిది మంది మంటల్లో చిక్కుకుపోయారని వెల్లడించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది లోపల చిక్కుకున్నవారిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
అగ్ని ప్రమాదం వల్ల భారీ ఎత్తున పవర్ స్టేషన్‌లో పొగ కమ్మేసింది. జీరో లెవల్ నుంచి సర్వీస్ బే వరకు పొగ కమ్మేయడంతో లోపలికి వెళ్లేందుకు వీలుపడడం లేదని అధికారులు తెలిపారు.
- Advertisement -