ఎన్నారై టీఆర్ఎస్…సాగర్ ఉప ఎన్నికల కరపత్రం రిలీజ్

33
trs

నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టి.ఆర్.యస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ గెలుపుకోసం ప్రచారం నిర్వహించడానికి ఎన్నారై టి.ఆర్.యస్ యూకే నాయకలు నియోజకవర్గానికి చేరుకున్నట్టు ఎన్నారై టి.ఆర్.యస్ యూకే కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టముక్కల తెలిపారు.ఈ సందర్భంగా నాగార్జునసాగర్ నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధి విషయాలతో కూడిన కరపత్రాన్ని మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ , అభ్యర్థి నోముల భగత్ మరియు స్థానిక నాయకులు కోటి రెడ్డి ఇతర నాయకులు నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రం లో జరిగిన బహిరంగ సభా వేదికపై ఆవిష్కరించారు.

సతీష్ రెడ్డి గొట్టముక్కల మాట్లాడుతూ ఎన్నారై టి.ఆర్.యస్ యూకే విభాగం దాదాపు పది సంవత్సరాలకు పైగా నాటి ఉద్యమ సమయం నుండి నేటి వరకు ప్రతీ ఎన్నికల్లో అటు సోషల్ మీడియా ద్వారా మరియు ఇటు క్షేత్రస్థాయిలో పర్యటించి కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ టి.ఆర్.యస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందేనని, అదే బాధ్యతతో నేడు నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో సైతం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని, కెసిఆర్ గారు చేసిన అభివృద్ధిని గడప గడపకు తెలియజేయడానికి ప్రత్యేక కరపత్రాన్ని రూపొందించామని, నేడు దాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు అభ్యర్థి నోముల భగత్ చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని సతీష్ తెలిపారు.

ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తన సందేశం లో నోముల నర్సయ్య గారి ఆశయాలని తన తనయుడు టి.ఆర్.యస్ అభ్యర్థి నోముల భగత్ ముందుకు తీసుకెళ్తాడానే నమ్మకం మాకుందని, యువ నాయకుడికి అవకాశం కలిపించినందుకు కెసిఆర్ గారికి కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే కర పత్రాన్ని ఆవిష్కరించి అన్ని సందర్భాల్లో ప్రోత్సాహాన్ని అందిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు అభ్యర్థి నోముల భగత్ లకు అశోక్ గౌడ్ కృతఙ్ఞతలు తెలిపారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉద్యమ సమయం నుండి లండన్ కేంద్రంగా ఎన్నారై టి.ఆర్.యస్ సెల్, పార్టీకి అన్ని రకాలుగా సేవలందించారాని, అటు సాధారణ ఎన్నికల్లో మరియు ఉప-ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో బృందంగా వచ్చి ప్రచారం నిర్వహించడం ఎంతో స్ఫూర్తినిస్తుందని, కెసిఆర్ గారి పట్ల టి.ఆర్.యస్ పార్టీ పట్ల వారికున్న అభిమానం చాలా గొప్పదని తెలిపారు. పార్టీకి గెలుపుకోసం విన్నూతంగా కరపత్రాలని ముద్రించి ప్రాచారం నిర్వహిస్తున్నందుకు ఎన్నారై టి.ఆర్.యస్ యూకే నాయకులను అభినందించారు.

టి.ఆర్.యస్ అభ్యర్థి నోముల భగత్ మాట్లాడుతూ తన గెలుపుకోసం మండుటెండలో ప్రచారం నిర్వహించడానికి వచ్చిన ఎన్నారై టి.ఆర్.యస్ యూకే నాయకులకు కృతఙ్ఞతలు తెలిపారు. తన తండ్రి నోముల నర్సయ్య గారి పట్ల వీరికున్న గౌరవానికి అలాగే తన గెలుపుకై ప్రత్యేక కార్యాచరణతో కృషి చేస్తున్నందుకు కృతఙ్ఞతలు తెలిపారు.

ఎన్నారై టి.ఆర్.యస్ నాయకులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, రాజ్ కుమార్ శానబోయిన, సత్య చిలుముల, మల్లేష్ పప్పుల,శ్రీనివాస్ వల్లాల, పృథ్వి రావుల, ప్రవీణ్ పంతులు, సుభాష్ తదితరులతో పాటి మరికొందరు ప్రాచారం లో పాల్గొంటున్నారని సతీష్ రెడ్డి తెలిపారు.నాగార్జునసాగర్ ప్రజలంతా అభివృద్ధికి ఓటేసి తెరాస అభ్యర్థి నోముల భగత్ ని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని ఎన్నారై టి.ఆర్.యస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎన్నారై టి.ఆర్.యస్ నాయకులు, స్థానిక నాయకులు ఎంసీ కోటి రెడ్డి, కొండా సైదులు, గోపనబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.