వైరల్ #NagarjunaSagarWithTRS..!

18
sagar

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కు గ్రామగ్రామాన ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు నోముల భగత్‌తో కలిసి టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఎందుకు ఓటేయాలో ప్రజలకు అర్ధం అయ్యేలా చెబుతున్నారు. దీంతో ప్రజల నుండి మంచి స్పందన వస్తుండగా సోషల్ మీడియాలో #NagarjunaSagarWithTRS అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది.

గతంలో కాంగ్రెస్,బీజేపీ నాయకులు ఎన్నికల సందర్భంగా మాట్లాడిన మాటలను షేర్ చేస్తున్న టీఆర్ఎస్ అభిమానులు, నెటిజన్లు నోముల భగత్ గెలుపు ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. వీరి ప్రచారానికి తగ్గట్టే బీజేపీ,కాంగ్రెస్ అగ్రనేతలెవరూ ప్రచారానికి మొహం చాటేస్తుండటాన్ని ప్రస్తావిస్తూ ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు.

మరోవైపు టిఆర్ఎస్ నాగార్జున‌సాగ‌ర్‌లో మండ‌లానికో ఎమ్మెల్యేను ఇన్‌‌ఛార్జ్‌ను నియ‌మించింది. మంత్రులు త‌ల‌సాని, మ‌హ‌మూద్ అలీ, స్థానిక మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ నెల 14 లేదా 15న సీఎం కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ ఉండనుండగా మంత్రి కేటీఆర్ కూడా ప్రచారానికి రానున్నారు. దీంతో గులాబీ కార్యకర్తలు జోష్ మీదుండగా ప్రత్యర్థి పార్టీల నేతలు ప్రచారం చేయడానికి నానా పాట్లు పడుతున్నారు.