అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన ఎన్ఐఏ అధికారిగా నటిస్తుండగా.. దియామీర్జా, సయామీ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసకుంది. ఈ నేపథ్యంలో చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. దీంతో నిర్మాతలు అటువైపు మొగ్గుచూపుతున్నట్టు, ప్రస్తుతం హక్కుల విషయమై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
లాక్ డౌన్ సమయంలో థియేటర్లు మూతబడడంతో చాలా సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. అయితే, అదే సమయంలో కొందరు నిర్మాతలను ఓటీటీ ఆదుకుంది. మంచి రేటు ఆఫర్ చేసి కొన్ని సినిమాలను ఆయా ఓటీటీ సంస్థలు సొంతం చేసుకున్నాయి. అయితే, అగ్ర హీరోల చిత్రాలు మాత్రం ఓటీటీకి వెళ్లకుండా థియేటర్ల కోసమే ఎదురుచూస్తున్నాయి. మరి నాగ్ మూవీ ఓటీటీలో లేదా థియేటర్లో విడుదల అవుతుందో చూడాలి.