నాగార్జున సాగర్‌ 20 గేట్లు ఎత్తివేత…

257
sagar
- Advertisement -

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణ, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి.ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది.శ్రీశైలంకు భారీగా వరద నీరు చేరుతుండటంతో గేట్లను ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు చేరడంతో 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.

ఇన్‌ ఫ్లో 4,49,433 క్యూసెక్కులు ఉండగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామ‌ర్థ్యం 312.0405 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిల్వ 306.3966 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 588.20 అడుగుల‌కు చేరింది.

- Advertisement -