నాగార్జున సాగర్‌ 8 గేట్లు ఎత్తివేత..

261
Nagarjuna Sagar Dam

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో కృష్ణమ్మ పరుగులు పెడుతుండగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్ధిరంగా ఇన్‌ ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్‌కు 1, 54,954 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సాగర్‌ 8 క్రస్ట్‌ గేట్లను పది అడుగుల మేర ఎత్తి పులిచింతలకు నీటిని విడుదల చేస్తున్నారు.

నాగార్జున సాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు (312.04 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 589.20 అడుగులు (309.15) టీఎంసీలుగా ఉంది. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్‌ జలాశయానికి వరద వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.088 టీఎంసీలకు చేరింది.