బిగ్ బాస్ 4…సేఫ్‌ జోన్‌లో నోయల్‌

213
noel

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 13 ఎపిసోడ్‌లు పూర్తిచేసుకుంది. ఇక రెండోవారం ఎలిమినేషన్‌లో భాగంగా 9 మంది ఎలిమినేట్ కాగా వీరిలో యూ ట్యూబ్ స్టార్ గంగవ్వ ,సొహైల్, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి,కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్‌,నోయల్, మొనాల్, సొహైల్ ఉన్నారు.

ఇక ఓటింగ్‌లో అభిజిత్,గంగవ్వ టాప్ పొజిషన్‌లో ఉండగా లీస్ట్‌లో అమ్మ రాజశేఖర్, కరాటే కల్యాణి ఉన్నారు. ఇక ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా నోయల్ ఎలిమినేషన్‌ నుండి సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిపోయారు.

వాస్తవానికి ఈ శనివారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళిపోతానని నానా హంగామా చేశారు నోయల్. అలాంటి నోయల్‌నే ఇంటి కెప్టెన్‌గా చేశారు సభ్యులు. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన నలుగుర్ని ఇంటి సభ్యులు ఎన్నుకోవాలని ఆదేశించగా ఏకాభిప్రాయంతో నోయల్, మొహబూబ్, కళ్యాణి, అభిజిత్‌లను ఎన్నుకున్నారు. వీరిలో నోయల్‌ని అంతా ఏకగ్రీవంగా కెప్టెన్‌గా ఎన్నుకోవడంతో ఈ వారం ఎలిమినేషన్‌ నుండి అనూహ్యంగా సేఫ్‌ జోన్‌లోకి వచ్చేశారు.