సాగర్‌కు సీఎం కేసీఆర్..డేట్ ఫిక్స్!

200
kcr cm
- Advertisement -

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పల్లె పల్లెన టీఆర్ఎస్‌కు అపూర్వ స్వాగతం లభిస్తుండగా ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు.ఇక సాగర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్.

ఈ నెల 17న పోలింగ్ ఉన్న నేపథ్యంలో 14 లేదా 15న హాలియాలో బహిరంగసభ ఏర్పాటు చేసే యోచనలో ఉంది టీఆర్ఎస్‌. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ని త్వరలో విడుదల చేయనున్నారు టీఆర్ఎస్ నేతలు.

ఇప్పటికే సభ అనుమతుల కోసం స్థానిక అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే, ఈనెల 13న ఉగాది పండుగ, 14న అంబేడ్కర్‌ జయంతి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల నుంచి వచ్చే అనుమతులకు అనుగుణంగా 14న లేదా 15న హాలియాలో ఏర్పాటు చేసే ప్రచార సభకు సీఎం కేసీఆర్‌ హాజరవుతారని పార్టీ ముఖ్యులు వివరించారు.

- Advertisement -