నాన్నే నా హీరో: నాగార్జున

186
akkineni
- Advertisement -

మై హీరో, మై ఇన్స్పిరేషన్…నాన్నే అని తెలిపారు అక్కినేని నాగార్జున. ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియోని రిలీజ్‌ చేశారు. సెప్టెంబర్ 20న నాకు చాలా ముఖ్యమైన రోజు. మై హీరో, మై ఇన్స్పిరేషన్… నాన్నగారి పుట్టిన రోజు. నాన్నగారికి పంచె కట్టు అంటే చాలా ఇష్టం. ఆయన పంచె కట్టుకున్నప్పుడల్లా చూస్తుంటే చాలా ముచ్చటేసేదని చెప్పుకొచ్చారు.

పుందూర్ ఖద్దరు అంటే నాన్నకు చాలా ఇష్టం. ఇది ఆయన నవరత్నాల హారం, ఇది ఆయన నవరత్నాల ఉంగరం, ఈ వాచ్ నాకన్నా సీనియర్… ఇదిప్పుడు నా ఫేవరేట్. ఇవన్నీ నాతో ఉంటే ఆయన నాతోనే ఉన్నట్టు ఉంటుందని చెప్పుకొచ్చారు.

- Advertisement -