బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 84 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోగా 84వ ఎపిసోడ్‌లో భాగంగా బెస్ట్ కెప్టెన్‌గా హారికతో పాటు అభిజిత్‌కు క్లాస్ పీకారు నాగ్. ఆమె చేసిన తప్పులన్నీ ఎత్తి చూపించారు. సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలిన హారిక చివరకు కంటతడి పెట్టుకుంది.
హారిక కెప్టెన్సీలో తప్పులు ఎత్తి చూపించిన నాగ్…అభిజిత్‌కు ఫేవర్‌గా కెప్టెన్సీ చేశావని చురకలంటించాడు. మోనాల్ బిజినెస్ అంటూ అభిజీత్ వచ్చి లొడలొడ ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే తెలుగులో మాట్లాడాలని ఎందుకు చెప్పలేదని పనీష్‌మెంట్ ఎందుకు ఇవ్వలేదని తెలిపాడు నాగ్. అలాగే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ను చేసేలా ఎందుకు ప్రోత్సహించలేదని తెలిపాడు.
అభిజిత్‌కు ఫేవరటిజం ఏం లేదు సార్. ఆ పరిస్థితుల్లో నాకు ఏం తోచలేదు. అతను చాలా ఫ్రస్టేట్ అయిపోతున్నాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అని తెలిపింది హారిక. అభిజిత్ చేసిన తప్పులను వీడియో ద్వారా ప్లే చేస్తూ చూపించిన నాగ్…నువ్వు కెప్టెన్ అయినప్పుడు ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అన్నావ్. కానీ అది కాదు. నువ్వు మోనల్ వల్ల అభిజీత్ కోసం కెప్టెన్‌వి అయ్యావు అని కడిగేశారు.
దీంతో సమాధానాలు చెప్పలేక హారిక మొహం మాడిపోయింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. అయితే, చివరకు హారికకు కొన్ని సలహాలు, సూచనలు చేసి నాగార్జున పంపేశారు.