వ్యాక్సిన్ తీసుకున్న నాగార్జున..

328
nagarjuna
- Advertisement -

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలిదశలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా ఇవ్వగా ప్రస్తుతం సామాన్య ప్రజలకు వ్యాక్సినేషన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా హీరో అక్కినేని నాగార్జున ఫస్ట్‌ డోస్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు నాగ్.

ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని, అందుకోసం ఆన్‌లైన్‌లో రిజిష్టర్‌ చేసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు రాజకీయ నాయకులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం నాగ్ నటించిన వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -