ఆ విషయం అడిగితే అక్కినేనికి కోపమట..!

321
Nagarjuna
- Advertisement -

అక్కినేని నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని హీరోలుగా ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్నా హీరోయిన్స్‌గా వచ్చిన తాజా చిత్రం దేవదాస్. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ నిర్మిస్తుండగా మణిశర్మ మ్యూజిక్ అందించారు.ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి కల్లెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున పలు అంశాలపై మాట్లాడారు. తాను అసలు పేపర్ చదవననీ, టీవీ చూడనని నాగార్జున తెలిపారు.‘మీ ఫిట్ నెస్ రహస్యం ఏంటి?’ అని ఎవరైనా అడిగితే తనకు పిచ్చ కోపం వస్తుందని అన్నారు.

Nagarjuna

అయితే తాను ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న రిపీటవుతూ ఉంటుందని వ్యాఖ్యానించారు. దీనికి తోడుగా తన గురించి ప్రస్తావించాల్సి వస్తే 59 ఏళ్ల నాగార్జున అంటూ చెబుతారని వ్యంగ్యంగా స్పందించారు. ఇది తన ఒక్కడికి మాత్రమే జరుగుతోందని సరదాగా చెప్పారు. మల్టీ స్టారర్ మూవీ కావడంతోనానితో పోటీ పడి నటించాల్సి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత అశ్వనీదత్ కూడా పాల్గొన్నారు.

- Advertisement -