‘బంగార్రాజు’ టీజర్ వచ్చేసింది..

25

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వ‌హిస్తున్న‌ ఈ మూవీ 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నూత‌న సంవ‌త్స‌రం రోజున బంగార్రాజు టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు.

‘‘నువ్వు మన ఊరికే సర్పంచ్ కాదు.. మన రాష్ట్రానికి, మన దేశానికే సర్పంచ్ కావాలి’’ అంటూ కృతితో చైతూ చెప్పే సంభాషణలు నవ్వించేలా ఉన్నాయి. ‘‘లయకారుడి సన్నిధిలోనే అపశ్రుతి. కలి మాయకాకపోదు’’ అంటూ యముడి పాత్రలో నాగబాబు చెప్పే డైలాగ్ లూ ఆకట్టుకున్నాయి. ఫైట్ సీన్స్ తీవ్రత కూడా ఓ రేంజ్ లోనే ఉంది.

అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో వ‌చ్చిన పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ వాసివాడి తస్సాదియ్య అనే పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. నాగార్జున, నాగ చైతన్య కలిసి ఇందులు స్టెప్పులు వేయగా.. ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

Bangarraju Teaser | Akkineni Nagarjuna | Naga Chaitanya | Ramya K | Krithi S| Faria A | Anup R