ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం..

20

ఆడపడుచులు బయటికి వెళ్లి తాగునీటి కోసం అవస్థలు పడవద్దనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని నాలుగు వార్డులకు గాను మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీటిని ఇంటింటికి అందించే కార్యక్రమాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు,ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.