సీఎం జగన్‌ మాటంటే అది తూటాతో సమానమం..

32

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటంటే అది తూటాతో సమానమని ఏపీ రాష్ట్ర శాసన సభాపతి తమ్మి నేని సీతారాం అన్నారు. స్థానిక బాపూజీ కళా మాందిర్‌లో డిఅర్డిఏ ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వసనీయత కలిగిన వ్యక్తి అని మనసు పెట్టిన గొప్ప మానవతా వాదిగా కీర్తికరించారు. రాష్ట్రం లో ఎన్ని అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందు లూ వచ్చినా నవరత్నాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని సంక్షేమ పదం వైపు పరుగులు పెట్టిస్తున్న ఘనత ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు వెయ్యి నుండి పెంచుకుంటూ నేటికీ 2500 చేశారని మళ్లీ ఎన్నికల నాటికి మూడు వేలకు పెంచుకుంటూ పోతారని అన్నారు. ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం చేపట్టినా నిబద్దతతో అమలు పరుస్తారని పేర్కొన్నారు. నేడు ఓటిఎస్ విధానం కూడా అమలు పరచి గృహ లబ్ధిదారులుకు లబ్ధి చేకూర్చే కార్యక్రమం చేపట్టారని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్,జిల్లా కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.