నాగ్ కోసమే బంగార్రాజు…!

215
Nagarjuna as Bangar raju
- Advertisement -

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సొగ్గాడే చిన్ని నాయన బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా నాగ్‌ హీరోగా బంగర్రాజు తెరకెక్కనుందని చిత్ర దర్శకుడు ప్రకటించాడు. అయితే ఈ చిత్రంలో నాగార్జునకి బదులు ‘మాస్‌ మహారాజ్‌’ రవితేజ నటిస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ క్లారిటీ ఇచ్చారు.

తాను తీయబోయే బంగర్రాజులో హీరోగా నాగార్జునేనని స్పష్టం చేశారు.  ‘బంగార్రాజు’ చిత్రంలో కేవలం నాగార్జున మాత్రమే నటించగలరని ఆయన పాత్రలో మరొకరిని ఉహించుకోలేమని చెప్పారు. ప్రస్తుతానికి స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతోందని అది పూర్తైన తర్వాత నాగార్జునకు కథ వినిపిస్తానని తెలిపారు. ఆయన ఎప్పుడు సిద్ధం అంటే అప్పుడే చిత్రీకరణ మొదలుపెడతామన్నారు.

తాను రవితేజతో సైతం ఓ సినిమా చేస్తున్నాని అది బంగార్రాజు కాదని స్పష్టం చేశారు. దీంతో కొంతకాలంగా టీ టౌన్‌లో బంగార్రాజుకు సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్త పుకారేనని స్పష్టమైంది. 2016లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించారు.  మరి దీనికి సీక్వెల్‌గా తెరకెక్కబోతున్న బంగార్రాజులో నాగ్‌తో జతకట్టేది ఎవరనేది దర్శకుడు వెల్లడించలేదు.

- Advertisement -