‘మహానటి’ చేతుల్లో మాస్‌ హీరో..!

293
Nagarjuna Akkineni talks about 'Mahanati'
- Advertisement -

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల పాత పోటోలను చూస్తే ఎంత క్యూట్ గా అనిపిస్తాయో అందరికి తెలిసిందే. చాలా వరకు అలాంటి ఫొటోలు కనిపిస్తే అభిమానుల నుంచి కూడా రెస్పాన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అలాంటి రెస్పాన్స్ వస్తోంది. అక్కినేని అభిమానులు వారి అభిమాన నటుడి చిన్ననాటి ఫొటో చూసి చాలా మురిసిపోతున్నారు. అయితే సావిత్రిగారు ఓ బాబుని ఎత్తుకుని ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Nagarjuna Akkineni talks about 'Mahanati'

ఈ ఫొటోలో ఉన్న హీరో ఎవరో కాదు. కింగ్ నాగార్జున. వెలుగు నీడలు చిత్రంలో కింగ్ నాగార్జున నటించారు. చిన్నతనంలో ఉన్న నాగార్జునని సావిత్రమ్మ ఎత్తుకుని జోలపాడుతున్న ఫొటోని ఓ నెటిజన్ నాగార్జునకు షేర్ చేశాడు. ఈ ఫొటో షేర్ చేసిన నెటిజన్‌కి థ్యాంక్స్ చెబుతూ.. ఈ ఫొటో వెలుగు నీడలు అనే చిత్రంలోనిది అంటూ నాగార్జున తన మధురమైన జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. అంతకుముందు మహానటి టీజర్‌పై నాగార్జున ప్రశంసల వర్షం కురిపించారు.

Nagarjuna Akkineni talks about 'Mahanati'

మహానటి సావిత్రి పేరు మీద ‘మహానటి’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్‌ రోల్‌లో కీర్తిసురేష్ నటిస్తుంది. సమంత, విజయ్ దేవరకొండ, షాలినీ పాండే మొదలగువారితో పాటు మహామహులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున ప్రస్తుతం రామ్‌గోపాల్‌ వర్మ మూవీ ‘ఆఫిసర్‌’లో నటిస్తున్నాడు.

Nagarjuna Akkineni talks about 'Mahanati'

- Advertisement -