15న నాగపూర్ బీఆర్ఎస్ భవనం ప్రారంభం..

62
- Advertisement -

దేశ రాజకీయాల్లో గుణాత్మకమార్పే లక్ష్యంగా బీఆర్ఎస్‌ను ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్ ఆ దిశగా ప్రయత్నలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో అన్ని అసెంబ్లీ స్ధానాల్లో బరిలో ఉండేలా ప్లాన్ చేస్తుండగా తాజాగా పార్టీ ఆఫీస్ ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్ అయింది.

నాగపూర్‌లో నిర్మించిన సువిశాలమైన భవనాన్ని ఈ నెల 15న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. 15న ఉదయం నాగపూర్‌ వెళ్లనున్న కేసీఆర్‌.. అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసిన చేరికల సమావేశంలోనూ పాల్గొంటారు.

Also Read:మాజీ ఎమ్మెల్యే దయాకర్‌ రెడ్డి కన్నుమూత..

ముంబై, పుణె, ఔరంగాబాద్‌లోనూ పార్టీ ఆఫీస్‌లను ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ నెల 19న నాందేడ్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌ రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

- Advertisement -