ఇంటి ఓనర్ తో భార్యకు పెళ్లి చేసిన భర్త…

188
marraiges

ఈమధ్య కాలంలో అక్రమ సంబంధాలకు అడ్డు అదుపులేకుండా పోతుంది. అక్రమ సంబంధాల వల్లే చాలా ఫ్యామిలీలలో గొడవలు వస్తున్నాయి. భార్య, భర్తలు ఉండగానే వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకుని అనవసరంగా ప్రాణాల మిదకు తెచ్చుకుంటున్నారు. మాములుగా అయితే భార్య వేరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని తెలిస్తే మనం గొడవ చేస్తాం..లేదా పోలీసులకు కంప్లైంట్ ఇస్తాం..కానీ ఇక్కడ విచిత్రంగా చేశాడు ఓ వ్యక్తి. తన భార్య ఇంటి ఓనర్ తో అక్రమం సంబంధం పెట్టుకుందని తెలిసి వారిద్దరికి దగ్గరుండి పెళ్లి చేశాడు ఓ వ్యక్తి.

వివరాల్లోకి వెళ్తే బిహార్ లోని భాగల్పూర్ సమీపంలోని ఖిరీభామ్ పంచాయితీ పరిధిలోని సాలెపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టణంలోని ఓ ఇంట్లో తన భార్యతో అద్దెకు ఉంటున్నాడు. వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఓ కేసులో అతనిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీంతో అతని భార్యకు ఆ ఇంటి యజమాని కుమారుడు మోనుతో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. దీంతో ఇద్దరూ కలిసి కొద్ది రోజులు ఎంజాయ్ చేశారు.

అయితే ఆమె భర్త జైలు శిక్షా కాలం ముగియడంతో అతను జైలు నుంచి విడుదలయ్యాడు. అతని భార్య ఇంటి ఓనర్ కొడుకుతో ఉండటం చూసిన భర్త..ఏం చేయాలో తెలిక వారిద్దరికి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు. మంచి రోజు చూసుకుని వారిద్దరికి పెళ్లి కూడా చేశాడు. తన కుమారుడిని తన భార్యకు ఇచ్చి అతను వేరే చోటుకు వెళ్లి జీవిస్తున్నాడు. ఈవిషయం ఇప్పుడు బీహార్ లో చర్చకు దారితీసింది.