చైతు ఫోటో వైరల్.. నిజమెంత ?

147
- Advertisement -

సమంతతో నాగ చైతన్య విడాకులు తీసుకోవడమే ఆలస్యం. చైతూ కి మరో హీరోయిన్ శోభిత దూళిపాల తో రిలేషన్ షిప్ ఉందని, దాన్నే సమంత ప్రశించినట్టు అందుకే ఈ జంట విడిపోయరనే టాక్ వినిపించింది. అప్పట్లో శోభితతో చైతూ కలిసి ఉన్న ఫోటోలు సామ్ ఫ్యాన్స్ బయటపెట్టి సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు. అంతెందుకు బంగార్రాజు ఈవెంట్ లో కుర్ర హీరోయిన్ దక్ష ని చూసి చైతూ నవ్విన క్లిప్ కట్ చేసి వైరల్ చేశారు సమంత ఫ్యాన్స్.

తాజాగా ఓ వైరల్ అవుతున్న ఫోటోతో చైతూ మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. ఇటివలే బర్త్ డే వేడుకల కోసం చైతూ లండన్ వెళ్ళాడు. ఆ ట్రిప్ శోభితతో కలిసి వెళ్ళాడని ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో పట్టుకొని సామ్ ఫ్యాన్స్ చైతు ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ ఫోటో నిజమా ? లేక ఫేకా ? అనే విషయం ఎవరూ పట్టించుకోకుండా పోస్టులు పెట్టడం కామెడీగా ఉంది.

నిజానికి చైతూ రీసెంట్ గా లండన్ వెళ్ళిన మాట నిజమే కానీ శోభిత తో కలిసి ఉన్న ఫోటో మాత్రం ఫేక్ అట. ఎవరో కావాలని ఎడిట్ చేసి చైతు ని ఇన్సల్ట్ చేసేందుకు చేసిన పనట. మరి ఈ ఫేక్ ఫోటో పట్టుకొని సమంత ఫ్యాన్స్ రెచ్చిపోవడం ఎంతవరకూ కరెక్ట్ ? వాళ్ళకే తెలియాలి.

ఇవి కూడా చదవండి….

పవన్ సొంత కథ… వామ్మో !

ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా :కృతి

జాక్‌పాట్ కొట్టిన శ్రీలీల…

 

- Advertisement -