సామ్ ఎల్లప్పుడూ బాగుండాలి:నాగచైతన్య

56
- Advertisement -

సమంతపై టాలీవుడ్ నటుడు నాగచైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు. కస్టడీ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సామ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరకుంటున్నట్లు చెప్పారు. మేము విడిపోయి రెండు సంవత్సారాలు అవుతోంది. అధికారికంగా విడాకులు తీసుకుని ఏడాది దాటింది. కోర్టు కూడా మాకు విడాకులు ఇచ్చిందని గుర్తు చేశారు.

సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల వల్లే మా మధ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయని..ఒకరిపై ఒకరికి గౌరవం లేదన్నట్లు ప్రజల్లోకి వెళ్లిందని అన్నారు. ఈ విషయం నన్ను ఎంతగానో బాధించిందని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో మరో చెత్త విషయం ఏంటంటే.. నా గతంతో సంబంధం లేని వ్యక్తిని ఇందులోకి లాగి వార్తలు రాయడం. దీనివల్ల ఆ మూడో వ్యక్తిని అగౌరవపరిచినట్లు అయ్యింది. వ్యక్తిగత జీవితంపై ప్రశ్నించినప్పుడు మొదట్లో పెద్దగా పట్టించుకునేవాడిని కాదన్నారు. మౌనంగా ఉండేవాడిని అన్నారు. కానీ ఇప్పటికీ నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారని ఇలాంటి వదంతులు ఎందుకు సృష్టిస్తున్నారో నాకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: కమల్‌హాసన్ చేతులమీదుగా ఎస్కే21 లాంఛ్

ప్రస్తుతం నాగచైతన్య కస్టడీ సినిమాను మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. కీలక పాత్రలో అరవింద్ స్వామి ప్రియమణి నటిస్తున్నారు.

Also Read: జూలై 14..మహావీరుడు విడుదల

- Advertisement -