చైతూ…థాంక్యూ మూవీ అప్‌డేట్..!

134
rashi khanna

అక్కినేని నాగ చైతన్య – రాశి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘థాంక్యూ’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇటలీ షెడ్యూల్ పూర్తయింది.ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు చైతూ – రాశి.

షూటింగ్ లొకేషన్‌లో నాగ చైతన్య – రాశిఖన్నా కలిసి దిగిన ఓ సెల్ఫీని రాశి షేర్ చేస్తూ…కీ అప్ డేట్ ఇచ్చేసింది. ఇటలీ షెడ్యూల్ పూర్తికావడంతో త్వరలోనేకరోనా పరిస్థితులు చక్కబడితే అనుకున్న సమయానికి చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.