యూఏఈలో టీ20 వరల్డ్ కప్!

103
icc

కరోనాతో ప్రపంచవ్యాప్తంగా పలు క్రికెట్ టోర్నమెంట్‌లు నిలిచిపోగా ఐపీఎల్ 14వ సీజన్ కూడా నిరవధికంగా వాయిదా పడింది. తాజాగా కరోనా కారణంగా పురుషుల టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా మూడు సబ్‌-రీజినల్‌ క్వాలిఫయర్‌ టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

మూడు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో ఎ, బి క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లు ఫిన్‌లాండ్‌లో జరగనుండగా, వచ్చే రెండు నెలల్లో సి క్వాలిఫయర్స్‌కు బెల్జియం ఆతిథ్యమివ్వాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లు రద్దుకాగా వీటితో పాటు టీ20 వరల్డ్‌కప్‌​ అమెరికా క్వాలిఫయర్స్​, ఆసియా క్వాలిఫయర్స్​ టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి.

ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో జరగాల్సిన 2021 టీ20 ప్రపంచకప్‌ కరోనా కారణంగా యూఏఈలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండగా దీనిపై ఐసీసీ ఇప్పటికే బీసీసీఐని సంప్రదించినట్లు టాక్.