అదిరిపోయిన ‘శైల‌జారెడ్డి అల్లుడు’ ఫ‌స్ట్ లుక్..

264
shailaja reddy alludu
- Advertisement -

నాగ‌చైత‌న్య హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెరెకెక్కుతున్న సినిమా శైల‌జారెడ్డి అల్లుడు. ఈసినిమాలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న హీరోయిన్ గా అను ఇమ‌మ్మాన్యుయేల్ న‌టించింది. స‌రికొత్త క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు ఈ అక్కినేని హీరో. యూత్ , ఫ్యామిలీ, మాస్ ఆడియ‌న్స్ కు న‌చ్చే విధంగా ఈసినిమాను తెర‌కెక్కించారు డైరెక్ట‌ర్ మారుతి. ఈమూవీలో ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర పోషించ‌నుంది.

naga-chaitanya

తాజాగా ఈమూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను ఇటివ‌లే విడుద‌ల చేశారు చిత్ర‌బృందం. అత్తా అల్లుళ్ల మ‌ధ్య‌లో జ‌రిగే స‌న్నివేశాల‌ను ఈసినిమాలో చూపించ‌నున్నారు. నాగ చైత‌న్య అత్త పాత్ర‌లో ర‌మ్య‌క్రిష్ణ న‌టించింది. తాజాగా విడుద‌ల చేసిన ఈసినిమా ఫ‌స్ట్ లుక్ కు ప్రేక్ష‌కుల నుంచి భారీ స్పంద‌న వ‌స్తుంది. ఇక తాజాగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ లో కూడా ర‌మ్య‌కృష్ణ లుక్ ను హైలెట్ చేశారు. ఈమూవీకి త‌మ‌న్ సంగీతం అందించారు. ప్ర‌స్తుతం ఈచిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఆగ‌స్టు నెల‌లో ఈసినిమాను విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క‌, నిర్మాతలు.

- Advertisement -