కారులో ట్రిమ్మింగ్ చేసుకుంటున్న ప్ర‌ముఖ క‌మెడీయ‌న్(వీడియో)

471
VennelaKishore Trim his Mustache
- Advertisement -

టాలీవుడ్ క‌మెడీయ‌న్ ల‌లో నెం1 ప్లేస్ లో దూసుకుపోతున్నాడు వెన్నెల కిషోర్. త‌న అద్బుత‌మైన కామెడీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. ఈజ‌న‌రేష‌న్ లో ఉన్న క‌మెడియ‌న్ ల‌లో ఎక్కువ సినిమాల్లో న‌టిస్తున్నాడు వెన్నెల కిషోర్. అయితే వెన్నెల కిషోర్ కు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ వీడియో చూస్తే మ‌న‌కే అర్ధ‌మ‌వుతుంది వెన్నెల కిషోర్ సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నాడో. వీడియో చూసిన ప‌లువురు నెటిజ‌న్లు ప‌లు కామెంట్లు పెడుతున్నారు.

Vennela-Kishore

వెన్నెల కిషోర్ కారులో వెళ్తుండ‌గా ట్రిమ్మింగ్ చేసుకుంటున్న వీడియోను త‌న ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. ఇది చూసిన అంద‌రూ గడ్డం గీసుకునేంత టైం కూడా లేదు మ‌నోడికి అని అనుకుంటున్నారు. ఇక ఆ వీడియోకు వివ‌ర‌ణ కూడా ఇచ్చాడు వెన్నెల కిషోర్. ర‌వితేజ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈసినిమాలో క‌మెడియ‌న్ గా వెన్నెల కిషోర్ న‌టిస్తున్నాడు.

ఈసినిమా షూటింగ్ అనుకున్న టైం కంటే ఓ పావు గంట ముందుగా జ‌ర‌గ‌డంతో ఈప‌ని చేయాల్సివ‌చ్చింన్నాడు క‌మెడీయ‌న్ వెన్నెల కిషోర్. ఇంటి వ‌ద్ద మేక‌ప్ కు స‌మ‌యం లేద‌ని అందువ‌ల్లే కారులో ట్రిమ్మింగ్ చేస‌కుంటున్నానని వివ‌ర‌ణ ఇచ్చాడు. వెన్నెల కిషోర్ పోస్ట్ చేసిన ఈవీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

- Advertisement -