తన మాజీ భార్య, సమంతపై నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘కస్టడీ’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియాతో వారి విడాకుల విషయాలు పంచుకున్నారు. ‘మేము విడిపోయి రెండేళ్లు అవుతుంది. చట్టప్రకారం విడాకులు తీసుకుని ఏడాది అవుతుంది. ప్రస్తుతం మేము మా జీవితాల్లో ముందుకు సాగిపోతున్నాం. సమంత మంచి మనిషి. ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నిజానికి మేము ఎందుకు విడిపోయాం అని అందరూ అడుగుతున్నారు. కేవలం మేం మీడియాలో వచ్చిన రూమర్స్ కారణంగానే విడిపోయాం. నేను మొదట్లో రూమర్స్ గురించి అంతగా పట్టించుకోలేదు కానీ, ఆ తర్వాత పరిస్థితులు మారాయి అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు ఈ కామెంట్సే వైరల్ గా మారాయి. అసలు రూమర్స్ కారణంగా భార్యను వదిలేశాను అని చెప్పడానికి నీకు సిగ్గు లేదా చైతు ? అంటూ నెటిజన్స్ చైతు పై సీరియస్ అవుతున్నారు. సమంత లవ్లీ ఉమెన్ అంటూనే.. ఇద్దరం వేరైనా ఆమెతో కలిసి ఉన్న రోజులను చాలా గౌరవంగానే చూస్తాను అనడం ఎంతవరకు కరెక్ట్ ? అంటూ చైతుని సమంత ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. అయినా, నెట్టింట్లో వదంతుల వల్లే విడాకులు తీసుకున్నాం అని చైతు చెప్పకుండా ఉండాల్సింది.
Also Read: కస్టడీ ట్రైలర్ విడుదల
ఇక నాగచైతన్య -కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమాను మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. నిన్న చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేసింది. ఈ మూవీలో చైతన్య పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో అరవింద స్వామి, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు.
Also Read: జూలై 14..మహావీరుడు విడుదల