చైతూ…లవ్‌స్టోరీ మరో అప్‌డేట్..!

398
nagachaitanya
- Advertisement -

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘లవ్ స్టోరీ’.ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమ కథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో అమిత ఆసక్తిని కలిగించింది. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ఏయ్ పిల్లా సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ రాగా ఫుల్ సాంగ్‌ను ఈ నెల 11న సాయంత్రం 4.05కి విడుదల చేయనున్నారు. ’ఫిదా’ హిట్ తరువాత శేఖర్ కమ్ముల నుంచి రానున్న సినిమా కావడంతో అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి.

‘ఫిదా’లో సాయి పల్లవి తెలంగాణ యాస మాట్లాడితే, ఈ సినిమాలో చైతూ తెలంగాణ యాస మాట్లాడనున్నాడు. రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తుండగా చైతూ నటిస్తున్న 19వ సినిమా ఇది.

- Advertisement -