మా ఎన్నికల్లో అక్రమాలు: నాగబాబు

144
nagababu
- Advertisement -

మా ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. మంచు విష్ణు ప్యానల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలిచిందని ఆరోపిస్తూ ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుండి గెలిచిన వారంతా రాజీనమా బాటపట్టారు. ఇది మాలో కలకలం సృష్టించగా తాజాగా నాగబాబు సైతం మరోసారి తీవ్రస్ధాయిలో స్పందించారు.

ఇకపై తాను ‘మా’ అసోసియేషన్‌ సభ్యుడిగా కొనసాగాలనుకోవడం లేదని మరోసారి స్పష్టం చేశారు.సాధారణ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరుగుతాయో ‘మా’ ఎన్నికల్లో అలాంటి అక్రమాలే జరిగాయన్నారు. ఎన్నికల్లో ప్రాంతీయవాదం, కులంతోపాటు ప్రకాశ్‌రాజ్ వృత్తిపరమైన విషయాలను తెరపైకి తీసుకువచ్చి పర్సనల్‌ ఇమేజ్‌కి ఇబ్బందికలిగేలా ప్రత్యర్థి ప్యానల్‌ సభ్యులు కామెంట్‌ చేసి దిగజారుడు రాజకీయాలకు తెరతీశారని చెప్పారు.

తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉండదు. విశాలహృదయంతో వ్యవహరిస్తారనుకున్నాను. కానీ, ఎన్నికల తర్వాత ఇలాంటి సంకుచితమైన అసోసియేషన్‌లో ఉండాలనిపించలేదన్నారు. ఇకపై ఈ అసోసియేషన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని… సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని అన్నయ్య చిరంజీవి ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఆయనకు అంత అహంకారం లేదని పరోక్షంగా మోహన్ బాబుపై కామెంట్స్ చేశారు.

- Advertisement -