నాగబాబు ఫైర్‌.. సుధీర్‌ టీం ఔట్ !

413
Nagababu fire on sudigali sudheer team
Nagababu fire on sudigali sudheer team
- Advertisement -

‘జబర్దస్త్’ షో తో సుడిగాలి సుధీర్ టీంకు ఓ ప్రత్యేకమైన పాపులార్టీ ఉంది.  ఈ షోతో క్రేజ్ సంపాదించిన ఈ టీం బయట కూడా మంచి స్నేహితులుగా ఉంటున్నారు.  జబర్దస్త్ కామెడీ షోలో సుడిగాలి సుధీర్ టీం ఓ స్టార్ టీంగా అయ్యింది. అయితే తాజాగా రేగిన ఓ వివాదంతో “సుధీర్ స్కిట్లు ఇక కనిపించవా..?? నాగబాబు జబర్దస్త్ షో నుంచి ఈ టీమ్ ని తప్పించాడా?? మ్మార్చి 31 న ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కు సంబంధించిన ప్రోమో ను చూస్తే ఈ విషయం అర్థమవుతోంది..

‘జబర్దస్త్’ కామెడీ షోలో సుడిగాలి సుధీర్ టీంకు ఉన్న పాపులారిటీ ఏంటో తెలిసిందే. మంచి రేటింగ్ వచ్చే జబర్దస్త్ స్కిట్లలో సుడిగాలి సుధీర్ టేమ్ కూడా ఒకటి. ఐతే ఈ మధ్య వీళ్ల స్కిట్లు అంతగా నవ్వించట్లేదు. అవి రొటీన్ అయిపోతున్నాయి. ముందుగా రష్మీ మీద సెటైర్‌ వేయడంతో నాగబాబు ఫైర్ అయ్యాడు. ఇక తాజాగా వేసిన ఒక స్కిట్ మరీ రొటీన్ గా ఉండటంతో నాగబాబుకు కోపం వచ్చేసింది. మీకు ఇగో.. పొగరు బాగా ఎక్కువైపోయాయి. ఇదొక స్కిట్టా అంటూ నాగబాబు అసహనం వ్యక్తం చేశారు. తర్వాత రోజా కూడా అందుకుని ఎప్పుడూ ఇదే కాన్సెప్టా అంటూ అసహనం వ్యక్తం చేసింది. దీనికి బదులుగా టీం సభ్యులు.. ఐతే మీరు చేయండి అంటూ వెటకారంగా అన్నారు. దీంతో నాగబాబుకు కోపం వచ్చేసింది. హద్దులు దాటి మాట్లాడుతున్నావ్ శీనూ.. అనడమే కాక.. ముందు మీరందరూ నా ఐ సైట్ నుంచి బయటికెళ్లండి అంటూ హెచ్చరిక చేశాడు నాగబాబు. ఈ స్కిట్ వచ్చే శుక్రవారం ప్రసారం కాబోతోంది.

అయితే జబర్దస్త్‌లో స్కిట్‌లు రోటీన్‌గా ఉండడంతో మళ్లీ జనాలను అట్రాక్ట్‌ చేసే క్రమంలో ఇలాంటి ప్రోమోలను టెలికాస్ట్‌ చేస్తారని అంటారు. అయితే సుడిగాలి సుధీర్ టీంపై నాగబాబు ఆగ్రహం నాటకీయమా… నిజామా… కానీ.. ఈ ప్రోమో మాత్రం ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

- Advertisement -