ఆ వేగం బ్లడ్‌లోనే ఉంది..

155
today Ram Charan Birthday Special Wishes..

చిరంజీవి త‌న‌యుడంటే ఆ ఎక్స్ పెక్టేష‌న్స్ మాములుగా ఉండ‌వు. హై ఓల్టేజ్ ఒంటి నిండా పెట్టుకు పుట్టాలి. అందుకు త‌గ్గ‌ట్టే క‌నిపిస్తాడు రామ్ చ‌ర‌ణ్. నటన వేగం తన బ్లడ్‌లోనే ఉందని తాను చేసిన సినిమాలతో నిరూపించుకున్నాడు చెర్రి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ .. ప్ర‌స్తుతం టాలీవుడ్లో 50 కోట్ల క్ల‌బ్ వ‌సూళ్లు సునాయాసంగా సాధించే హీరో. మాస్‌, క్లాస్ అనే తేడా లేకుండా ప్ర‌తిఒక్క‌రూ అభిమానించే హీరో. తన ప‌దేళ్ల కెరీర్ లో చెర్రీ న‌టించిన మ‌గధీర హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ గా నిలిచిన తొలి తెలుగు చిత్రం.

 today Ram Charan Birthday Special Wishes..

అయితే చిరుత‌తో మొద‌లైన కెరీర్ లో మ‌గ‌ధీర‌ తిరుగులేని హిట్‌ గా నిలిచింది. తన కెరీర్ రెండో సినిమానే 80 కోట్ల పైబ‌డిన వ‌సూళ్లు సాధించి చ‌రిత్ర సృష్టించింది. అంతే కాకుండా ఇటీవ‌లే నటించిన `ధృవ‌` సైతం అదే త‌ర‌హా ఫ‌లితాన్ని అందుకుంది. మ‌ధ్య‌లో అర‌డ‌జ‌ను పైగానే 50 కోట్లు పైగా వ‌సూళ్లు సాధించిన సినిమాలున్నాయి. యావ‌రేజ్ అన్న టాక్ వ‌చ్చినా మినిమం 50కోట్లు వ‌సూలు చేసే స‌త్తా ఉన్న హీరోగా చ‌ర‌ణ్ పేరు మార్మోగుతోంది.

 today Ram Charan Birthday Special Wishes..

తాజాగా సుకుమార్ డైరెక్ష‌న్లో ఓ డిఫ‌రెంట్ మూవీ చేస్తున్నాడు చెర్రి. ఇందులో వినికిడి లోపం ఉన్న వ్య‌క్తి పాత్ర షురూ చేస్తున్నాడు. ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నున్నారు. ప్ర‌స్తుతం ఇతర మార్కెట్లపైన కూడా క‌న్నేశాడు చెర్రి. అందుకే త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌లోనూ మార్కెట్ లలో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్టుల్ని ఎంచుకుంటూ ముందుకు సాగాల‌న్న ఆలోచ‌న‌లో చ‌ర‌ణ్ ఉన్నాడు. ఇదిలా ఉంటే..నేడు రామచరణ్ పుట్టినరోజు. ఇప్పటికే అభిమానుల నుంచి గ్రీటింగ్స్ అందుకున్న చెర్రి వేగం ఇలానే కొన‌సాగాలని మ‌రిన్ని మంచి ప్రాజెక్టులు చేసి ప్రేక్ష‌కాభిమానుల ఆశ‌ల‌ను నెర‌వేర్చాల‌ని ఆశిద్దాం.. హ్యాపీ బ‌ర్త్ డే చెర్రీ.