పదేళ్ల కల నెరవేరింది.. నాగబాబు ఎమోషనల్

12
- Advertisement -

పదేళ్ల కల నెరవేరిందన్నారు మెగాబ్రదర్ నాగబాబు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభ్యులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తొలుత సీఎంగా చంద్రబాబు ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ ప్రమాణస్వీకారం చేశారు.

ఈ సందర్భంగా త‌న త‌మ్ముడిని చూసి నాగ‌బాబు భావోద్వేగానికి లోన‌య్యారు. అసెంబ్లీ గ్యాల‌రీలో కూర్చుని కళ్యాణ్ ప్ర‌మాణ స్వీకారం చూసి త‌న మ‌న‌సు ఆనందంతో నిండిపోయిన‌ట్లుగా చెప్పారు. పదేళ్ల కల నెరవేరింది, ప్రజా ప్రస్థానం మొదలైంది…ప‌వ‌న్ నిజాయితీతో, నిష్ప‌క్ష‌పాతంగా అంతఃక‌ర‌ణ శుద్ధితో త‌న మంత్రిత్వ శాఖ‌ల‌కు న్యాయం చేస్తాడ‌ని నాగబాబు భావోద్వేగ‌పు పోస్ట్ పెట్టారు.

- Advertisement -