అమ్మమ్మ గారింట్లో… నాగశౌర్య

272
- Advertisement -

ప్రస్తుతం ఛలో సక్సెస్‌ ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ హీరో నాగశౌర్య. ఇప్పటికే ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న కణం షూటింగ్ పూర్తి చేసిన ఈ యంగ్‌ హీరో మరిన్ని సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు.సుందర్ సూర్య దర్శకత్వంలో అమ్మమ్మ గారిల్లు అనే చిత్రం చేస్తున్నాడు. షామిలీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

చక్కటి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఓయ్ సినిమా తర్వాత షామిలీ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రిలేష‌న్ నెవెర్ ఎండ్ అనే కాన్సెప్ట్ ను ఆధారంగా చేసుకుని ఈ చిత్ర కథ రాసుకున్నట్టు దర్శకుడు తెలియజేశాడు.

nagashourya

దీంతో పాటు కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో గురువారం మార్చి ఒకటితో పాటు సాయి శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించనున్నాడు. ఈ సినిమా తరువాత మరోసారి సొంత బ్యానర్‌ ఐరా క్రియేషన్స్ లో శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నర్తనశాల సినిమాలో నటించనున్నాడు.

- Advertisement -