మరో రియాల్టీషోతో ఓంకార్ అన్నయ్య

287
Omkar reality show
- Advertisement -

బుల్లితెరపై యాంకర్ గా పరిచయం అయిన ఓంకార్ వెండితెరపై దర్శకుడిగా రాణిస్తున్నాడు. రాజు గారి గది అనే హరర్ కామెడీ ట్రాక్ తో తొలి హిట్ కొట్టిన ఓంకార్ దీనికి సీక్వెల్ గా నాగార్జున తో రాజు గారి గది 2 చేశాడు. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ లభించిన ఓంకార్ డైరెక్షన్ కి ప్రశంసలు లభించాయి.

అయితే ఈ సారి ట్రాక్ మార్చిన ఓంకార్ ఈ సారి ఓ క్లాసీ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ఇది క్రీడకి సంబంధించిన కథ కాగా ఇందులో కుర్ర బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషించనున్నాడట. ప్రస్తుతం సాక్ష్యం సినిమాతో బిజీగా ఉన్న శ్రీను త్వరలోనే ఈ మూవీని పూర్తి చేసి వెంటనే ఓంకార్ టీంతో కలవనున్నాడని అంటున్నారు. ఓంకార్- బెల్లంకొండ శ్రీనివాస్ కాంబోలో రానున్న ప్రాజెక్ట్ మాస్ అంశాలతో పాటు కామెడీ సన్నివేశాల నేపధ్యంతో రూపొందనున్నట్టు తెలుస్తుంది.

Omkar reality show

దీంతో పాటు తనకు లైఫ్‌ ఇచ్చిన బుల్లితెరపై కూడా అలరించేందుకు సిద్దమవుతున్నాడట ఓంకార్. స్టార్ మా ఛానెల్‌లో ఈ రియాల్టీషో ప్రత్యక్ష ప్రసారం కానుందట. మొత్తంగా ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు తనకు లైఫ్‌ ఇచ్చిన బుల్లితెరను కూడా వదలట్లేదు ఓంకార్ అన్నయ్య.

- Advertisement -