వాళ్ళని చూసే నేను “గే” లా నటించా..!

415
- Advertisement -

నాగసౌర్య నటిస్తున్న “నర్తనశాల” సినిమా ఆగష్టు 30న విడుదలకు సిద్ధంగా వుంది. శ్రీనివాస్ చక్రవర్తి డెబ్యూ ఫిలింగా రాబోతున్న ఈ సినిమా లో నాగ సూర్య ఓ గే పాత్రలో ప్రేక్షకులకు కనిపించబోతున్నాడు. సాధారణంగా ఓ హీరో గే పాత్ర పోషించడం అనేది చాలా కష్టతరమైన విషయం. అందులోనూ నాగ శౌర్య చూడటానికి ఎంతో మ్యాన్లీగా ,అందంగా ఉంటాడు కాబట్టి తాను ఆ పాత్ర పోషిస్తే ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో అని చిత్ర బృందం మొదట భయపడ్డారట. కానీ శౌర్య పెర్ఫార్మన్స్ చూసి షాకైపోయి, సూపర్ అంటూ చప్పట్లు కొట్టేశారట.

Naga Shourya On about his Gay Role in Narthanasala..

అచ్చం ఓ గే లా నటించిన శౌర్యాని ఎలా నటించావ్ అని అడిగితే. తన ఫ్రెండ్స్ లో ఇద్దరు గే లు ఉన్నారని, వాళ్ళని ఇమిటేట్ చేసానని చెప్పాడట. ఏది ఏమైనా ఓ వినూత్న కథతో రాబోతున్న నర్తనశాల పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతుంది.

Naga Shourya On about his Gay Role in Narthanasala..

అంతకు ముందు గే అంటే ఆమడ దూరం పరిగెత్తే జనాలు, ఇప్పుడు వాళ్ళు పక్కనే ఉన్నా పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. మాములు సమాజంతో దాదాపుగా కలిసిపోతున్న ఈ బృహన్నల జాతిలోని ఓ కుర్రాడి కథలా వస్తున్న ఈ చిత్రం, చిత్రబృందానికి ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి మరి.

- Advertisement -