చంద్రబాబు ఓ కార్మిక ద్రోహి : రోజా

193
Roja fire on chandrababu Naidu

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం చంద్రబాబు పై విమర్శలు గప్పించారు. చంద్రబాబు ఓ కార్మిక ద్రోహి అని దుయ్యబట్టారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన రామయ్య దంపతులు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

అయతే ఈ ఘటనపై రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదని, రుణమాఫీ కాలేదని రామయ్య దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. అంతేకాకుండా ఇది మమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని చెప్పారు.

Roja fire on chandrababu

ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధపు హామీలను ఇచ్చారని, ఆయన పాలనలో చిత్తూరు, రేణిగుంట ఫ్యాక్టరీ, విజయపాల ఫ్యాక్టరీలు మూతపడ్డాయిని రోజా విమర్శించారు. తిరుపతి ఆర్టీసీ గ్యారేజీని ఇతర జిల్లాలకు తరలించే యత్నం జరుగుతోందని మండిపడ్డారు. కాగా..ఈ గ్యారేజీ కార్మికులకు వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు.