విభిన్నమైన చిత్రాలను నిర్మించే సంస్థగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భవ్య క్రియేషన్స్ కు మంచి పేరు ఉంది. నందమూరి బాలకృష్ణ నటించిన `పైసా వసూల్` తర్వాత ఈ సంస్థ తాజాగా ఓ సినిమాకు శ్రీకారం చుట్టింది. `ఛలో` సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు నాగశౌర్యతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. కొత్త దర్శకుడు రాజా కొలుసును పరిచయం చేస్తూ భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న తొమ్మిదో చిత్రమిది.
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శనివారం ఉదయం లాంఛనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నిర్మాత ఆనంద ప్రసాద్ సతీమణి కృష్ణ కుమారి, హీరో నాగశౌర్య తల్లి దండ్రులు ఉషా బాల, శంకరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత చెప్పారు. ఈ సినిమాకు కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: మహతి స్వర సాగర్, ఆర్ట్: వివేక్, ఎడిటర్: ప‌్రవీణ్ పూడి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రాజా కొలుసు.